ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్.. బ్లూ టిక్ కావాలంటే నెలవారీ లేదా ఏడాది వారీగా సబ్ స్క్రిప్షన్ చార్జీలు చెల్లించాలి లేదంటే ఏప్రిల్ 20 నుంచి వెరిఫైడ్ బ్లూ టిక్ లు తొలగించడం జరుగుతుందని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నంత పని చేసాడు. దీంతో బ్లూ టిక్ కోల్పోయిన వారిలో పలువురు సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు ఉన్నారు.
బ్లూ టిక్ ని కోల్పోయిన వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్, తమిళనాడు మంత్రి, యువ హీరో ఉదయనిధి స్థాలిన్, స్టార్ హీరో విజయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులు ఉన్నారు. ఇక బాలీవుడ్ కు చెందిన స్టార్స్ షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్ తదితరులు ఉన్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీలలో మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్, నితిన్, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఇలా చాలా మంది సెలెబ్రిటీలు తమ బ్లూ టిక్ కోల్పోయారు.
ఇకపోతే బ్లూటిక్ ఉంటే అది ఒరిజినల్ అకౌంట్ అని లెక్క. ఫేక్ అకౌంట్లు క్రియేట్ అయినా బ్లూ టిక్ లేకపోతే ఆ అకౌంట్లు ఒరిజినల్ కావాని యూజర్లకు ఇట్టే అర్థమయ్యేది. ఇప్పుడు బ్లూ టిక్ లేకపోతే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో తెలిసే ఛాన్స్ లేదు. మరి వీరందరూ బ్లూటిక్ కోసం ఎలన్ మస్క్ చెప్పినట్టుగా సబ్స్ స్క్రిప్షన్ చేసుకుంటారా? లేదా చూడాలి మరి ?