కరోనా టీకా రెండో డోసు వేయించుకున్న 28 రోజుల తర్వాతే రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ (ఎన్బీటీసీ) అధికారులు తెలిపారు. తొలి డోసు తీసుకున్నాక 56 రోజుల పాటు, రెండో డోసు తీసుకున్న తరువాత 28 రోజులు రక్తదానం చేయరాదని టీకా లబ్ధిదారులకు ఎన్బీటీసీ నిర్దేశించింది. ఏ టీకా తీసుకన్నప్పటికి ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా అధికారులు కోరారు.