Site icon TeluguMirchi.com

గుడ్ న్యూస్ : బ్లాక్ ఫంగస్ (మ్యుక‌ర్‌మైకోసిస్) చికిత్స కోసం ఇంజక్షన్ తయారీ

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో రూపాన్ని మార్చుకొని మ‌రింత విరుచుకుపడుతుంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అయితే క‌రోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతమందిలో తాజాగా బ్లాక్ ఫంగ‌స్‌/మ్యుక‌ర్‌మైకోసిస్ పేరుతో కొత్త వ్యాధి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. దేశంలో రోజురోజుకి దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రప్రభుత్వం ఈ వ్యాధిపై దృష్టిసారించింది.

ఫలితంగా ఈ వ్యాధి చికిత్సకోసం ఒక ఇంజక్షన్ ని రూపొందించింది. జెనెటిక్ లైఫ్ సైన్సెస్, వార్ధా జంటగా మ్యుక‌ర్‌మైకోసిస్ చికిత్సకోసం Amphotericin B Emulsion ఇంజెక్షన్స్ రూపొందించింది. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్స్ ఒక్క కంపెనీ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. వచ్చే సోమవారం నుండి ఈ ఇంజెక్షన్స్ బహిరంగ మార్కెట్లో విక్రయించనున్నారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు 1200 రూపాయలుగా నిర్ణయించింది.

Exit mobile version