Site icon TeluguMirchi.com

శ్రీశాంత్ పై.. బీసీసీఐ సస్పెన్షన్ వేటు !

IPL-Spot-fixingక్రికెట్ ప్రియులను గత నెలరోజులుగా కనువిందు చేస్తున్న ఐపీల్ -6 పై ఫిక్సింగ్ భూతం ఆవరించింది. తాజాగా బయటపడిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ ప్రియులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఆటగాళ్లు శ్రీశాంత్, చవాన్, చండీలాలను ఈరోజు ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు బీసీసీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మరోవైపు కేరళ క్రికెట్ అసోసియేషన్ స్పాట్ ఫిక్సింగ్ పై స్పందించింది. ఒకవేళ శ్రీశాంత్ పై ఆరోపణలు నిజమని ఋజువైతే.. అతన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేస్తామని తెలిపింది.

Exit mobile version