Site icon TeluguMirchi.com

బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలుచోట్ల వర్షాలు !

Low depressionదక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత నెలరోజులుగా వడదెబ్బకు కుదేలవుతున్న ప్రజలకు ఈ అల్పపీడనంతో.. కాస్త ఉపశమనం లభించింది. కాగా, అల్పపీడనం ఈ రోజు
సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు పడతాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం కూడా ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Exit mobile version