Site icon TeluguMirchi.com

డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా..?

బ్యాంకు ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఓ రోజు బ్యాంకు తో తప్పనిసరి పని..డబ్బులు జమ చేసుకోవడమో..తీయడంలో లేక మరేఇతర పనుల్లో ఇలా ప్రతి ఒక్కరికి బ్యాంకు తో అవసరం. అయితే డిసెంబర్ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయో..ఈరోజు సెలవొ అనేది తప్పక తెలుసుకోండి.

డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బ్యాంకులకు డిసెంబర్ 1 వ తేదీన సెలవు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఇక డిసెంబర్ 6, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27 ఆదివారాలు కాబట్టి నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అదే విధంగా డిసెంబర్ 12, డిసెంబర్ 26 వ తేదీలు రెండు, నాలుగో శనివారాలు కాబట్టి బ్యాంకులు పనిచేయవు. అలానే డిసెంబర్ 25 క్రిస్మస్ కాబట్టి ఆరోజు సెలవు ఉంటుంది. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 27 వరకు మూడు రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. ఇలా మొత్తం మీద డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులే సెలవులు వచ్చాయి.

Exit mobile version