బెంగళూరు లో గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ బంగ్లాదేశీలు

బెంగళూరు లో 22 సంవత్సరాల ఒక మహిళను వేధించి గ్యాంగ్ రేప్ కి పాల్పడిన కేసులో 6 (ఇద్దరు మహిళలతో కలిపి)బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసారు. గ్యాంగ్ రేప్ కి సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా పోస్ట్ చేసారు, ఈ వీడియోపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ ఘటన ఆరు రోజుల క్రితం బెంగుళూరులో జరిగినట్లు తెలుస్తోంది.

అత్యాచారానికి గురైన మహిళతో పాటు నిందితులంతా బంగ్లాదేశీలు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్థిక అంశంలో విబేధాలు రావడంతో.. ఆ క్రూరత్వానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అరెస్టు అయిన వారిలో మహమ్మద్ బాబా షేక్‌, రిఫాతుల్ ఇస్లామ్ రిదే బాబో, సాగర్‌, అఖిల్‌లు ఉన్నారు. మహిళ ఐడెంటిటీని పోలీసులు వెల్లడించలేదు. నిందితులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు అని అనుమానిస్తున్నారు. బాధితురాలు ఢాకాకు చెందినట్లు అక్కడి పోలీసులు తేల్చారు.