ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి దోమలగూడలోని ఆశ్రయంలో గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించారు. బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
కర్నూల్ జిల్లాకు చెందిన బాలసాయిబాబా 18 సంవత్సరాల వయసులోనే తొలిసారి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. కడుపులోంచి శివలింగం తీసే విద్య ద్వారా బాలసాయిబాబా ప్రాచుర్యం పొందారు. కర్నూల్ శివారులో బాలసాయిబాబాకు వందల ఎకరాల భూములు కలవు. అలాగే బాలసాయిబాబా ను కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి.