మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. కొత్త ఏడాది వేడుకల కోసం అజారుద్దీన్ తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది.
అయితే ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. కారు డ్రైవర్ బ్రేక్ వేసే సమయంలో వాహనం అదుపు తప్పినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.