కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు శర్వశక్తుల్ని ఒడ్డుతూ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక చర్యలు చేపట్టిన భారత ప్రభుత్వం తాజాగా కరోనాకు సంబంధించిన వైద్య చికిత్సలను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది. కరోనాకు సంబంధించిన టెస్టింగ్ మరియు చికిత్స రెండూ ఈ పథకం కింద అన్ని ఆస్పత్రులలో చేయించుకొనే అవకాశం కల్పించింది.
ఇదీలావుంటే భారత్ లో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం మంది 21 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్లేనని కేంద్రం వెల్లడించింది. 17 శాతం మంది 60 ఏళ్లకు పైబడినవాళ్లని, 9 శాతం మంది 20 ఏళ్ల లోపువారని పేర్కొంది.