Site icon TeluguMirchi.com

అస్సాంలో ముద్దుల బాబా అరెస్టు

అస్సాంలో తన వద్దకు వచ్చే మహిళలకు ముద్దులు, కౌగిలింతలు ఇస్తూ రోగాలను నివారిస్తానని నమ్మబలుకుతూ.. గత కొంతకాలం నుండి స్థానికులను మోసం చేస్తున్న ముద్దుల బాబాగా పిలుచుకునే రామ్ ప్రకాష్ చౌహాన్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బాబా ఇచ్చే ముద్దులను “చమత్కారి చుంబన్” పేరుతో ప్రచారం చేయడానికి, బాబా తల్లి ప్రచారకర్తగా ఉండి భక్తులను తీసుకువచ్చేవారని పోలీసులు తెలిపారు.

రామ్ ప్రకాష్ చౌహాన్‌కి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తే ప్రత్యక్షమై వరాలిచ్చాడని ఆ వరాల వల్లే బాబా ముద్దులిస్తే రోగాలు తగ్గుతున్నాయని ఆయన తల్లి ప్రచారం చేయడం గమనార్హం. అలాగే చౌహాన్ తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ మధ్యకాలంలో బాబా తనకోసం ఓ గుడి కూడా కట్టుకున్నాడని.. ఆ గుడికి కూడా భక్తులు రావడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు.

తాను ఎవరినైనా ముద్దు పెట్టుకున్నా.. కౌగలించుకున్నా వారికున్న రోగాలన్నీ తనకు ఉన్న అతీంద్రియ శక్తులు వాళ్ళ మటుమాయమవుతాయని, అలాగే వారి సమస్యలన్నీ కూడా తీరుతాయని ముద్దుల బాబా ప్రచారం చేయడంతో తండోపతండాలుగా నిరక్ష్యరాసులైన భక్తులు అతడి నివాసానికి క్యూ కట్టడం ప్రారంభించారు. అదే అదును చూసుకొని తన వద్దకు వచ్చే వారి బలహీనతలను క్యాష్ చేసుకోవడం, అలాగే మహిళల పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఈ మధ్య కాలంలో బాబా ఆగడాలుతో విసిగిపోయిన భక్తులు పోలీస్ స్టేషనులో ఫిర్యాదులు చేయడంతో, పోలీసులు ప్రత్యేకంగా ఈ బాబాపై నిఘా పెట్టి అరెస్టు చేశారు.

Exit mobile version