అక్రమ సంబంధాల గుట్టు రట్టు…..!

ashley-madison-members-leak
అష్లే మాడిసన్ వెబ్‌సైట్, వివాహేతర సంబంధాలకు వేదికగా పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ‘ఈ జీవితం చిన్నది…. ఎఫైర్ పెట్టుకో’ అనే నినాదంతో ఆన్‌లైన్ డేటింగ్ వెబ్‌సైట్‌గా పని చేస్తోంది. అయితే, దాని వినియోగదారులు ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇటీవల, కొందరు హ్యాకర్లు కెనడా వేదికగా నడుస్తున్న అష్లే మాడిసన్ వెబ్‌సైట్‌పై దాడి చేసి అందులో అక్రమ సంబంధాలు నెరపుతున్నవారి సమాచారాన్ని తస్కరించారు. తస్కరించిన సమాచారాన్ని లీక్ చెయ్యకుండా ఉండాలంటే తమకు కోరినంత డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. దీంతో వారు కోరినంత డబ్బు ఇవ్వలేమని వెబ్‌సైట్ నిర్వహకులు చేతులెత్తేయడంతో హ్యాకర్లు అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న వారి పేర్లను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల అక్రమ సంబంధాల గుట్టు విప్పినట్లు అంచనా.

అక్రమ సంబందాల గుట్టు రట్టు అవడంతో, కొందరు జీవిత భాగస్వాముల దగ్గర ముఖం చెల్లక తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందులో కొందరు బడా బాబులు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇక ఇండియా నుండి ఈ వెబ్ సైట్ కి దాదాపు 1.5 లక్షల మంది వినియోగాదులు ఉన్నట్లు అంచనా. సమాచారం ప్రకారం అత్యధికంగా ఢిల్లీ నుండి 38,620 మెంబెర్స్ ఉండగా, హైదరాబాద్ నుండి 12,548 మెంబెర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.