కరోనా తో నర్స్ మృతి ..ఆమె చివరి మాటలు వింటే కన్నీరు పెట్టుకోవాల్సిందే

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. యూరోప్‌లో ప్రధాన దేశమైన బ్రిటన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే అక్కడ కరోనా మృతుల 4వేలు దాటిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నస్రీన్ అనే నర్సు(38) కరోనా బారిన పడి చనిపోయింది. చనిపోయే ముందు భర్త ఆమె పక్కనే ఉన్నారు. చివరిగా ఆమె భర్తతో చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

నర్సు పరిస్థితి విషమించడంతో ఆమె మాట్లాడలేకపోయినా సైగలతో పిల్లలు జాగ్రత్త అంటూ భర్తకు చెప్పింది. దీంతో భర్త ఆమె దగ్గరకు వెళ్లి ‘బెంగ పెట్టుకోకు.. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటా’ అని చెప్పాడు. ఆ తర్వాత డాక్టర్లు వద్దని చెబుతున్నా భార్యను హత్తుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నస్రీన్ ప్రాణాలు కోల్పోయింది. నస్రీన్‌కు ఆస్పత్రితో సుదీర్ఘ సంబంధం ఉండటంతో అక్కడి సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.