ఏప్రిల్ 15 నుండి పట్టాలెక్కనున్న రైళ్లు

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రైళ్లు కూడా బంద్ అయ్యాయి. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ ముగియనున్నడం తో ఏప్రిల్ 15 నుండి మళ్లీ రైళ్లు పట్టాలెక్కనున్నాయని రైల్వే అధికారులు తెలియజేసారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి వెల్లడించారు. అయితే లాక్‌డౌన్ పూర్తి కాగానే ప్యాసింజర్ సేవలు ఒక్కసారిగా ప్రారంభం కావన్నారు.

మరోవైపు మందులు, నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను త్వరగా సరఫరా చేసేందుకు ప్రత్యేక గూడ్స్‌ రైళ్ళను నడపాల్సిందిగా అధికారులను రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఆదేశించారు. మరి, వరుసగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. మరి, లాక్ డౌన్ గతంలో ప్రకటించిన తేదీ తోనే ముగుస్తోందా.. లేక, మరో సారి పొడిగిస్తారా? అనేది మాత్రం వేచిచూడాలి.