Site icon TeluguMirchi.com

అపోలో ఆధ్వర్యంలో ప్రత్యేక కొవిడ్ నిర్ధారణ పరీక్షలు

భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉన్న పరీక్షా కేంద్రాలు నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్యకనుగుణంగా సేవలు అందించలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాధి నిర్థారణలో కీలకమైన కోవిడ్-19 ఆర్ టి పీసీయార్ (ఐసియంఆర్ వారి అనుమతులకనుగుణంగా) పరీక్షలకు వారికి అందించడానికై వీలుగా అపోలో డయాగ్నస్టిక్స్, అపోలో హెల్త్ మరియు లైఫ్ స్టైల్ లిమిటెడ్ వారి డయాగ్నస్టిక్ విభాగం వారు హైదరాబాదులో ప్రత్యేకమైన డ్రైవ్ ఇన్ పరీక్షా కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. తద్వారా వందలాది మంది పౌరులకు త్వరిత గతిన కరోనా చికిత్స అందించడానికి వీలు కలుగనుంది. ఇలా నెలకొల్పబడుతున్న పరీక్షా కేంద్రాలలో రోజూ 250 మంది పేషెంట్ల వరకూ వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించగలిగే సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

హైదరాబాదులో మొట్ట మొదటి సారిగా నెలకొల్పబడుతున్న ఈ డ్రైవ్ ఇన్ కరోనా పరీక్షా కేంద్రాన్ని మెరిడియన్ స్కూలు, మాదాపూర్ లో నేడు శుక్రవారం 23 ఏప్రియల్ నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రం ద్వారా ప్రధానంగా గచ్చిబౌలి, కూకట్ పల్లి, మాదాపూర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మరియు కొండాపూర్ వాసులకు సేవలు అందిస్తుంది. ఈ పరీక్షా కేంద్రానికి వచ్చే వారు మెరిడియన్ స్కూలు, గేట్ నెం.2 (మాదాపూర్ బ్రాంచ్) వద్ద నుండి రావాల్సి ఉంటుంది.

ఈ పరీక్షా కేంద్రానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభతరమైన ఐదు అంశాలతో కూడిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది.

1) పరీక్షా కేంద్రానికి వచ్చే వారు తమ నమోదు కార్యక్రమాన్ని మొబైల్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా చేసిన వెంటనే వారి మొబైల్ లో టోకెన్ అందుకోవడం జరుగుతుంది.
2) టోకెన్ అందుకొన్న తర్వాత పరీక్ష చేయించుకోదలచిన వారు తగిన రుసుము ఆన్ లైన్ లోనే చెల్లించి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.
3) టోకెన్ నెంబర్ ఆధారంగా ఫెల్భొటోమిస్టు (పరీక్ష నిర్వహించే నిపుణులు) నమూనాలను సేకరిస్తారు.
4) నమూనాను సేకరించిన వెంటనే పరీక్ష చేయించుకొన్న వారి మొబైల్ లో వివరములతో పాటూ బిల్లు కూడా మెసేజ్ ద్వారా అందుతాయి. పరీక్షకు వచ్చే వారు తమతో పాటూ ప్రభుత్వం పేర్కొన్న విధంగా తగిన గుర్తింపు కార్డు (ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ) ను తమ వెంట తెచ్చుకోవాలి.
5) పరీక్షానంతరం అపోలో డయాగ్నస్టిక్స్ వారు 48-72 గంటలలోగా రిపోర్టును ఆన్ లైన్ లోనే అందించడం జరుగుతుంది.

ఈ ప్రక్రియ అంతా మానవ రహితంగా మొత్తం ఆన్ లైన్ లోనే సాగుతుంది.

రానున్న రోజులలో అపోలో డయాగ్నస్టిక్స్ వారు హైదరాబాదులో ఇలాంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త పరీక్షా కేంద్రాల వివరాలను ఎప్పటికపుడు ఆపోలో డయాగ్నస్టిక్స్ వారి వెబ్ సైట్ (www.apollodiagnostics.in) లో ఉంచడం జరుగుతుంది.

పరీక్షా కేంద్రాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం అపోలో డయాగ్నస్టిక్ కస్టమర్ కేర్ వారిని 040-44442424 లో సంప్రదించగలరు.

Exit mobile version