ఏపీ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 43 మంది డీఎస్పీ (సివిల్‌), ఏపీఎస్పీ సహాయ కమాండెంట్లను బదిలీ చేసింది. వీరిలో ఏడుగురికి పోస్టింగ్‌ ఇచ్చింది. మిగతా 36 మందిని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని పేర్కొంది. ఈమేరకు డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.