Site icon TeluguMirchi.com

సంపూర్ణేష్ కు ప్రత్యేక ఆహ్వానం పంపిన చంద్రబాబు.

krishna-push-babuహృదయ కాలేయం చిత్రంతో సునామి ల ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. మొదటి చిత్రంతోనే విచిత్ర హిట్ కొట్టేసిన ఈ స్టార్ , ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే హీరోగా నటిస్తున్నాడు. సోషల్ మీడియా లో ఇతగాడి ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇది చూసే కావొచ్చు కృష్ణా పుష్కరాలు ప్రారంభంనికి రావల్సిందిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంపూకీ స్పెషల్ ఇన్విటేషన్ పంపింది. ఈ ఇన్విటేషన్ చూసి బాబు ను బాబు ఆహ్వానించడం ఏంటో అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. సంపూ సైతం ఇన్విటేషన్ చూసి ఆనందానికి అవధులు లేవంటూ వెంటనే ఇన్విటేషన్‌ని ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడు.

ప్రస్తుతం కొబ్బరి మట్ట చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం లో పెదరాయుడు, ఆండ్రాయిడ్, పాపారాయుడు అనే మూడు పాత్రలలో కనిపించనున్నాడు.

Exit mobile version