ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్నా సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్లో తెలిపారు.
ఇదీలావుంటే కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యాధి సోకిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పర్సన్స్ ను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. ఇక క్వారంటైన్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, అనుమానితులకు కల్పిస్తున్న వసతుల విషయంలో ఏ మాత్రం రాజీ పడరాదని సీఎం జగన్ ఆదేశించారు.