ఇదీలావుంటే గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఫోన్ చేశారు. గుజరాత్లో చిక్కుకున్న తెలుగు మత్స్యకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వసతి, భోజన సదుపాయాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. జగన్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గుజరాత్ సీఎం.. ఏపీ మత్సకారులను ఆదుకుంటామని వెల్లడించారు