వింబుల్డన్ ను ముద్దాడిన.. ముర్రే..!

Andy-Murray-becomes-first-Bఅది 77 సంవత్సరాల బ్రిటన్ వాసుల కల. అదే వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్.. 1936లో పెర్రీ వింబుల్డన్ పురుషుల టైటిల్ ముద్దాడిన తరవాత.. 77ఏళ్ల బ్రిటన్ కలను టెన్నిస్ వీరుడు ఆండీ ముర్రే ఆదివారం నెరవేర్చాడు. నిరుడు తృటిలో చేజారిన వింబుల్డన్ ను ఈసారి సొంత గడ్డపై సగర్వంగా తలకెత్తుకున్నాడు. లండన్ లో ఆదివారం జరిగిన ఫైనల్స్ లో సెర్బియన్ క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్ పై మూడు గంటల తొమ్మిది నిమిషాలపాటు పోరాడి 6-4, 7-5, 6-4 తేడాతో ముర్రే టైటిల్ సొంతం చేసుకున్నాడు. దీంతో.. బ్రిటన్ వాసులు పెర్రీ పోయే.. ముర్రే వచ్చే అని తెగ ఆనందపడిపోతున్నారు.