ఇండియా తో మ్యాచ్ కు ముందు వెస్టిండీస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది . వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ ఎడమ మోకాలు గాయం కారణంగా వరల్డ్ కప్ నుండి దూరమయ్యాడని, అతని స్థానంలో సునీల్ అంబ్రీస్ రానున్నాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆండ్రూ రస్సెల్ వరల్డ్ కప్ మొదటినుండే ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్నాడు. వరల్డ్ కప్ లో కేవలం 4 మ్యాచ్ లు ఆడిన రస్సెల్ 36 పరుగులు చేసి 5 వికెట్లను మాత్రమే తీసుకున్నాడు.