అమెరికా అంటే అందరికీ మోజు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్. ఆదేశ ప్రజలే ఆ దేశానికి వెళ్ళడం లేదు. అవును..భారత్లో ఉంటున్న అమెరికన్లు ఇక్కడే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు . ఈ విషయాన్ని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కరోనా నేపథ్యంలో ఇండియాలోని దాదాపు 50 వేల మందికిపైగా అమెరికా జాతీయులను తమ దేశానికి తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక విమానాల ద్వారా తరలింపు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. మరోవైపు ఎక్కువ శాతం అమెరికన్లు స్వదేశానికి వెళ్లేందుకు నో చెప్పడం షాకింగ్ వుంది. ఆ దేశం ఇప్పుడు కరోనా తో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ బెటర్ అనుకుంటున్నారు అమెరికన్స్.