రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రాన్ని కాఫీపొడితో తయారు చేసి ఆయన పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు విశాఖపట్నం దత్తసాయినగర్‌కు చెంది న నాయన సురేష్. గాజువాక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తున్న సురేష్. తీరిక సమయంలో వరిగడ్డి, చీపురు పుల్లలు, కాగితాలతో కళాఖండాలు రూపొందిస్తుంటారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని తాజాగా కాఫీపొడితో చిత్రాన్ని రూపుదిద్దారు.