రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబానీ అందిరికీ అదిరిపోయే షాకిచ్చాడు. దాదాపు 140కిలోల బరువు ఉండే అనంత్.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చేశాడు. సొంత జట్టుని దగ్గరుండి ఎంకరేజ్ చేసేవాడు. 140కిలోల బరువుండే అనంత్.. ఇప్పుడు 70కిలోల అనంత్ గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. సోమనాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చిన అనంత్ ను చూసి అందరు షాక్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటూ.. ఆరా తీయగా అసలు విషయం తెలియవచ్చింది. సన్నబడటం కోసం అనంతం కఠోర శ్రమ చేశాడట. ఇందుకు ప్రముఖ అమెరిక ఫిట్ నెస్ ట్రైనర్ సమక్షంలో భారీ కసరత్తు చేశాడు. అప్పుడు గానీ 140కేజీల కౌటౌట్ 70కేజీలకు తగ్గలేదు. అన్నట్టు.. ఒకప్పుడు అనంత్ బాబాయ్ అనీల్ అంబానీ కూడా భారీ కటౌట్ తో ఉండేవాట.