కరోనా వల్ల ముకేశ్‌ అంబానీ ఎంత నష్టపోయారో తెలుసా ?


కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ దేశాన్ని ఆర్ధికంగా కుదిపివేసింది. సామాన్యులకే కాదు.. అపర కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. ఆయన తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

గత రెండు నెలల్లో స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంబానీ మార్చి 31 నాటికి రోజుకి 300 మిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయన మొత్తంగా 19 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయినట్లు హురున్ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ అనే సంస్థ వెల్లడించింది.