ఏపీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ భారీ సాయం


కరోనాపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ భారీ సాయం అందించింది. కొవిడ్‌ 19 నివారణ చర్యల కోసం రూ.5కోట్లు విరాళం ప్రకటించింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ విరాళాన్ని ఏపీ సీఎం సహాయ నిధికి జమ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను ప్రశంసిస్తూ లేఖ రాశారు.

కాగా.. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థ శాంసంగ్ ఇండియా కరోనా భూతంపై పోరాటానికి తన వంతు సాయం ప్రకటించింది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 కోట్లు ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. కొవిడ్-19పై పోరులో భారత ప్రజలకు తాము మద్దతుగా నిలుస్తామని శాంసంగ్ వెల్లడించింది. రూ.15 కోట్లు పీఎం కేర్స్ ఫండ్ కు, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్లు ఇస్తున్నట్టు వివరించింది.