ప్రస్తుతం ఇండియాలో స్విగ్గీ మరియు జొమాటో బాగా డిమాండ్ ఉంది. ఈ రెండు ఫుడ్ డెలవరీ సంస్థలు యమ బిజీగా ఫుడ్‌ను డెలవరీ చేస్తున్నాయి. ఉబెర్ ఈట్స్ ఉన్నా కూడా ఈ రెండు ఎక్కువగా మార్కెట్‌లో దూసుకు పోతున్నాయి. అందుకే ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసి అమెజాన్ ఆ రెండు ఫుడ్ డెలవరీ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు మొదలు అయ్యాయి. సెప్టెంబర్‌లో అమెజాన్ ఫుడ్ డెలవరీని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అమెజాన్ ఇందుకోసం కొత్తగా సిబ్బందిని కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.