ఒకప్పుడు ఈకామర్స్ బిజినెస్ ఇండియాలో చాలా తక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ప్రపంచ దేశాలకు పోటీగా ఈకామర్స్ బిజినెస్ ఇండియాలో జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఫుడ్ డెలవరీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఇండియాలో ఫుడ్ డెలవరీ సంస్థలు భారీ లాభాలను దక్కించుకుంటుంది. దాంతో ఫుడ్ డెలవరీ రంగంలోకి అమెజాన్ అడుగు పెట్టేందుకు సిద్దం అయినట్లుగా మార్కెట్ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఇండియాలో స్విగ్గీ మరియు జొమాటో బాగా డిమాండ్ ఉంది. ఈ రెండు ఫుడ్ డెలవరీ సంస్థలు యమ బిజీగా ఫుడ్‌ను డెలవరీ చేస్తున్నాయి. ఉబెర్ ఈట్స్ ఉన్నా కూడా ఈ రెండు ఎక్కువగా మార్కెట్‌లో దూసుకు పోతున్నాయి. అందుకే ఉబెర్ ఈట్స్‌ను కొనుగోలు చేసి అమెజాన్ ఆ రెండు ఫుడ్ డెలవరీ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ప్రయత్నాలు మొదలు అయ్యాయి. సెప్టెంబర్‌లో అమెజాన్ ఫుడ్ డెలవరీని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అమెజాన్ ఇందుకోసం కొత్తగా సిబ్బందిని కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.