భారీ ఆఫర్లతో సిద్దమైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్


ఈ- కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు సంస్ధలు పోటాపోటీగా సేల్స్‌ ఆఫర్లు ప్రకటించాయి. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ ‘పేరిట అమెజాన్ సేల్ నిర్వహించనుండగా, ‘బిగ్ సేవింగ్ డేస్’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ను ప్రారంభించనుంది.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2023 జనవరి 17 నుంచి జనవరి 20 వరకూ ఉంటుంది. అంటే జనవరి 16 రాత్రి నుంచే ప్రారంభమౌతుంది, ప్రైమ్ సభ్యులకు యధావిధిగా జనవరి 16 నుంచి అంటే జనవరి 15 రాత్రి నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో అమెజాన్ ఎస్బీఐతో భాగస్వామ్యం కారణంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు పర్చేజ్‌తో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కలిగి అదనపు ప్రయోజనాల్ని పొందేందుకు కార్డు సిద్ధం చేసుకోండి. స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ జనవరి 15 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌, హోమ్ అప్లయెన్సెస్‌, కిచెన్ యాక్ససరీస్‌, లైఫ్‌ స్టైల్‌ ఉత్పత్తులపై ఆఫర్లు ఇస్తోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా మైక్రోసైట్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్‌ క్రెడిట్ కార్ట్‌ యూజర్లకు 10శాతం, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు 5శాతం, ఫ్లిప్‌కార్ట్‌ పే ద్వారా చెల్లింపులు చేసిన వారికి వెయ్యి రూపాయల విలువైన రిటర్న్ గిఫ్ట్‌ కార్టును ఇస్తోంది.