కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం అమర్ నాథ్ వార్షిక యాత్ర రద్దు చేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు . అయితే ఆన్ లైన్ లో భక్తులకు హారతి లభిస్తుందన్నారు. శ్రీ అమర్ నాథ్ దేవాలయ మండలితో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. గతంలో మాదిరిగానే దేవాలయంలో సంప్రదాయబద్ద ఆచార వ్యవహారాలు, పూజల జరుగుతాయని మనోజ్ సిన్హా తెలిపారు. ఈ యాత్ర ఈ నెల 28న ప్రారంభం కావలసి ఉంది.