దేశ ప్రజలంతా ఆ రాత్రి ఆ పని చేయాలనీ మోడీ పిలుపు

కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపును ఇచ్చారు.

ఏప్రిల్ 5వ తేదీన‌.. 130 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌హాశ‌క్తి జాగ‌ర‌ణ చేయాల‌న్నారు. దేశ ప్ర‌జ‌లు మ‌హాసంక‌ల్పాన్ని ప్ర‌ద‌ర్శించాల‌న్నారు. ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాల‌ను వెలిగించాల‌న్నారు. కేవ‌లం 9 నిమిషాల స‌మ‌యాన్ని కేటాయించాల‌న్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాల‌న్నారు.

ఆ ప్ర‌కాశంతో అంధ‌కారాన్ని పార‌ద్రోలాల‌న్నారు. మేం ఒంట‌రిగా లేమ‌న్న సందేశాన్ని వినిపించాల‌న్నారు. ఎవ‌రూ కూడా రోడ్ల‌పై వెళ్ల‌కూడ‌ద‌న్నారు. సామాజిక దూరాన్ని ఎప్పుడూ ఉల్లంఘించ‌కూడ‌ద‌న్నారు. క‌రోనా సైకిల్‌ను బ్రేక్ చేసేందుకు ఇదొక్క‌టే మార్గ‌మ‌ని ప్ర‌ధాని తెలిపారు. 5వ తేదీన ఒంట‌రిగా కూర్చుని మ‌హాభార‌తాన్ని గుర్తు చేసుకోండ‌న్నారు. 130 కోట్ల ప్ర‌జ‌ల సంక‌ల్పాన్ని ఆలోచించాల‌న్నారు. గెల‌వాల‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని నింపుకోవాల‌న్నారు. మ‌న ఉత్సాహాన్ని మించిన శ‌క్తి ఏదీ లేద‌న్నారు. ఈ ప్ర‌పంచంలో మ‌న‌శ‌క్తితో జ‌యించ‌లేనిది ఏదీ లేద‌న్నారు.