కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా వైన్ షాప్స్ బంద్ కావడం తో మందు బాబుల కష్టాలు అన్ని ఇన్ని కావు. మందు కు బానిసైన వారు గత కొన్ని రోజులుగా మద్యం దొరకకపోయేసరికి పిచ్చి పట్టినట్లు, మతిస్తిమితం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల తట్టుకోలేక ఆత్మహత్యలు, చాకులతో గొంతు కోసుకుంటున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మద్యానికి బానిసైన ఓ యువకుడు హైదరాబాద్‌లో నడి రోడ్డుపై గొంతు కోసుకున్నాడు. గత ఎనిమిది రోజులుగా మద్యం దొరకకపోవడంతో షాపుల చుట్టూ తిరిగి తిరిగి విరక్తి చెందిన ఆయన చింతల్ బస్తీ ప్రాంతంలో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. రోడ్డుపై రక్తపు మడుగుతో కనిపించడంతో పోలీసులు అతణ్ని గమనించి ఆస్పత్రికి తరలించారు. మధ్యం దొరకకపోయేసరికి కొందరికి శరీరంలో విపరీతమైన వణుకు వస్తుందని దీనిని ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్స్ చెపుతున్నారు.
మొదటి దశలో శరీరంలో విపరీతమైన వొణుకు వస్తుందని తర్వాత ఇలాంటి వారికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ తెలిపారు. ఇది ముదిరితే రోగి పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తారని, ఆత్మహత్య చేసుకోవడం, ఇతరులను గాయపర్చడం, తమకుతాము గాయపర్చుకోవడం లాటివి చేస్తారని చెప్పారు. ఇలాంటి వారిని వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడం తో అలాంటివని ఆయా కుటుంబ సభ్యులు హాస్పటల్ కు తీసుకెళ్లడం స్టార్ట్ చేసారు.