Site icon TeluguMirchi.com

అమ్మాయిలకు అక్షయ్‌ మెసేజ్‌..

Bengaluru-woman-groped

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆడవారికి ఓ పవర్ ఫుల్ మెసేజ్ ను అందించాడు..ఇటీవల న్యూ వేడుకల్లో బెంగళూరులో మహిళలపై జరిగిన వేధింపులపై పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే..ఈ ఘటన పట్ల రాజకీయ నాయకులే కాదు సినీ స్టార్స్ సైతం తమ వైఖరిని తెలియజేస్తున్నారు..

తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు..‘మహిళలను గౌరవించని సమాజానికి ఇది మానవసమాజం అని చెప్పుకొనే అర్హత లేదు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే.. అమ్మాయిలు వేసుకునే బట్టల ఫై , వారు బయటకు వచ్చిన వేళలపై అసహనం కలిగించేలా మాట్లాడుతున్నారు. అమ్మాయిల దుస్తులు కాదు.. కురచగా ఉన్నది మీ ఆలోచనా విధానం అని అలాంటి వాళ్లందరికీ చెప్పదలచుకున్నాను’.

‘అబ్బాయిల కన్నా అమ్మాయిలు బలహీనులేం కాదు. మిమ్మల్ని మీరు సంరక్షించుకునే శక్తి మీకు ఉంది. అబ్బాయిల అకృత్యాలను అడ్డుకోవడానికి మార్షల్‌ ఆర్ట్స్‌లో కొన్ని మెలకువలు ఉన్నాయి. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని తాకే శక్తి ఎవరికీ లేదు. మీరు భయపడాల్సిన అవసరంలేదు, కాస్త అలర్ట్‌గా ఉండండి. ఆత్మరక్షణ నేర్చుకోండి.. ఎవరైనా మీ దుస్తుల గురించి మాట్లాడితే వాళ్ల పని వాళ్లను చూసుకోమనండి’ అంటూ ఓ మెసేజ్ ను వీడియో రూపం లో తెలిపాడు .

Exit mobile version