రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆకాష్ అంబానీతో వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతా కు వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ముంబైలోని అంబానీ ఇంటిలో మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి .
ఈ వేడుకకు వచ్చిన బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా ఆకాష్, శ్లోకాలతో కలిసి ఉన్న ఫోటో ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రియాంక తో పాటు షారూక్ ఖాన్, కరణ్ జోహార్, ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, మొదలగు బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు.
ఆకాష్, శ్లోకాల నిశ్చితార్థము ఈ నెల 30 వ తేదీన ముంబై లో ఘనంగా జరగనుంది. ఈ ఏడాది చివర్లో వీరి వివాహ వేడుకలు జరగనున్నాయి. ఆకాష్, శ్లోకా లు ధీరుభాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు .