రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అత్యాధునికమైన కొత్త తరం అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి జూన్ 28న ఉదయం 10.55 గంటలకు బాలాసోర్లోని దీనిని విజయవంతంగా పరీక్షించారు. తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ మరియు రాడార్ స్టేషన్ల ద్వారా.. ఈ క్షిపణి ప్రయోగాన్ని లక్ష్య ఛేదనను పర్యవేక్షించారు. ఈ క్షిపణి టెక్స్ట్ బుక్ పథాన్ని.. అనుసరించింది. ఈ క్షిపణిమిషన్ లక్ష్యాలను అత్యధిక స్థాయి కచ్చితత్వంతో నిర్ధారిత లక్ష్యాలను చేరుకుంది. అగ్ని పీ క్షిపణుల అగ్ని తరగతి యొక్క కొత్త తరం అధునాతన వేరియంట్. ఇది 1,000 నుండి 2,000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్ధ్యంతో కూడిన క్యానిస్టరైజ్డ్ క్షిపణి.