వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా, తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. జన్యుక్రమ పరిశీలనలో భాగంగా- వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైన 63 మంది ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ నిపుణులు గమనిస్తూ వచ్చారు.
వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారే. మొత్తంగా 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. రెండు డోసులు తీసుకున్నవారిలో 52.8% మంది, ఒక్క డోసు తీసుకున్నవారిలో 47.2% మంది ఇన్ఫెక్షన్కు గురయ్యారు. వీరికి 5 నుంచి 7 రోజులపాటు జ్వరం వచ్చినా, తీవ్రస్థాయి అనారోగ్యం మాత్రం దరిచేరలేదని నిపుణులు గుర్తించారు.