Site icon TeluguMirchi.com

పెద్దన్ననే హెచ్చరించిన తాలిబన్లు

గత కొన్నాళ్లుగా అమెరికా మరియు అఫ్ఘనిస్తాన్‌ తాలిబన్‌ నేతల మద్య యుద్ద వాతావరణం కనిపిస్తూనే ఉంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ పరిస్థితులకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ఉద్దేశ్యంతో రెండు వైపుల నుండి చర్చలకు ముందుకు వచ్చారు. దాంతో ఈనెల 23న తాలిబన్లకు మరియు పెద్దన్న అమెరికాకు మద్య చర్చలు జరగాల్సి ఉంది. కాని ఇటీవలే తాలిబన్లు అమెరికన్‌ సైనికుడిని చంపేయడం జరిగింది. దాంతో వారితో శాంతి చర్చలు చేయలేం అంటూ అమెరికా వెనక్కు తగ్గింది. ఈ విషయమై తాలిబన్‌ నాయకులు తీవ్రంగా స్పందించారు.

తాలిబన్లతో చర్చలు జరపడం అమెరికాకు చాలా అవసరం. మాతో చర్చలకు వెనక్కు తగ్గితే అమెరికాలో జరుగబోతున్న పరిణామాలను మా బాధ్యత కాదని, అమెరికా చాలా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. తాలిబన్ల హెచ్చరికతో అమెరికా మరింత సీరియస్‌గా తమ దేశ భద్రత విషయమై ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించింది. తాలిబన్ల దూకుడు కారణంగా ఇప్పటికే అమెరికా చాలా మంది సైనికులను కోల్పోయింది. అందుకే ప్రస్తుతం అమెరికా తీసుకోబోతున్న స్టెప్‌ ఏంటీ అనేది ఆసక్తిగా మారింది.

Exit mobile version