స్పాట్ ఫిక్సింగ్ లో బాలీవుడ్ నటుడు అరెస్ట్ !

Vindoo-arrestedఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో.. అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ స్పాట్ ఫిక్సింగ్ కుంభంకోణం ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే అండర్ వరల్డ్ మాఫీయా హస్తం వుందని అనుమానిస్తున్న.. ఈ స్పాట్ ఫిక్సింగ్ తాజాగా బాలీవుడ్ కు కూడా అంటుకుంది. ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు దాదాసింగ్ తనయుడు విందూ సింగ్ ను ముంబాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విందూ కు క్రికెట్ బుకీలతో సంబంధాలున్నట్లు క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. కాగా, ఈ కేసులో మరింత కొంతమంది ప్రముఖులు కూడా అరెస్ట్ కావచ్చనే వార్తలొస్తున్నాయి.