ఈ సంఘటన మరెక్కడో జరగలేదు, మన తెలుగు రాష్ట్రం చిత్తూరు జిల్లాలో జరిగింది. పవిత్ర అంటూ ఒక పవిత్రమైన పేరును పెట్టుకుని ఆమె చేసినవి అన్ని కూడా అపవిత్రమైన పనులు. పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల వరకు అంతా సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు భర్త బోర్ కొట్టాడు. దాంతో అడ్డ దారిలో అక్రమ సంబంధం పెట్టుకుని సుఖాలు పొందింది. ఆ సుఖాలను జీవితాంతం పొందాలని భావించింది. అందుకు తన పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి, వారిని ఉరి వేసి మరీ చంపేసింది. వివరాలు తెలిసిన కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు ఉరి వేసి రాత్రికి రాత్రి ప్రియుడు వద్దకు ఆమె చెక్కేసింది. ఇలాంటి నీచురాలిని వెంటనే ఉరిశిక్ష వేసి ఈ ప్రపంచంలో లేకుండా చేయాలని కోరుకుంటున్నారు.