Site icon TeluguMirchi.com

ప్రేమ పేరుతో లొంగతీసుకుని, వీడియో తీసి, ఆపై బ్లాక్‌మెయిల్‌

ప్రేమించాం అనగానే కొందరు అమ్మాయిలు గుడ్డిగా నమ్మేసి, అన్ని అర్పించేస్తుంటారు. ఆ తర్వాత అతడి నిజ స్వరూపం తెలిసి ఆత్మహత్యలు చేసుకోవడం లేదా, మరేదైనా చేయడం చేస్తూ ఉంటారు. తాజాగా బెంగళూరులో మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. కోల్‌కత్తాకు చెందిన ఆరిందమ్‌ నాథ్‌ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. ఆయన కంపెనీలోనే జాబ్‌ చేసి జూనియర్‌తో పరిచయాన్ని పెంచుకున్నాడు.

ఆ పరిచయంను ప్రేమగా మార్చుకునేందుకు ఆయనకు పెద్దగా టైం పట్టలేదు. ఆమెను తక్కువ సమయంలోనే తన చుట్టు తిరిగేలా చేసుకున్నాడు. అతడి దొంగ ప్రేమను గుర్తించకుండా ఆ అమ్మాయి సర్వస్వం అర్పించింది. ఆమె బలహీన క్షణాలను ఆరిందమ్‌ తనకు అనుకూలంగా మార్చుకుని లొంగదీసుకున్నాడు. ఆ సమయంలో వీడియో చిత్రీకరించి పోర్న్‌ సైట్‌లో పెడతాను అంటూ బెదిరించ సాగాడు. డబ్బులు లాగుతూ, తనకు అవసరం ఉన్నప్పుడల్లా తన వద్దకు రావాలి అంటున్నాడు.

గత కొన్నాళ్లుగా ఆరిందమ్‌ ఆమెను పూర్తిగా వాడేసుకుంటున్నాడు. ఆమె విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆరిందమ్‌ వద్ద ఉన్న ఈ వీడియోలను తీసుకుని, కేసు నమోదు చేశారు.

Exit mobile version