అక్కలు తిట్టారనే కోపంతో చిన్నమ్మాయి ఇల్లు విడిచి వెళ్లి పోయింది. ఎటు పోతుంది, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తుందని అక్కలు భావించారు. కాని వారం రోజులు గడిచిన చెల్లి ఆచూకి లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెదికి వెదికి వేసారి పోయారు. తమ చెల్లి ఏమైందో అంటూ ముగ్గురు అక్కలు ఆందోళన చెందుతున్న సమయంలో ఒక రోజు చెల్లి నుండి ఫోన్ వచ్చింది. తాను చాలా సంతోషంగా ఉన్నాను, తన గురించి ఆందోళన అక్కర్లేదు అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది. దాంతో పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది.
అక్కల కంటే ముందు పెళ్లి చేసుకోవడం సమాజం చులకనగా చూస్తుందనే ఉద్దేశ్యంతో ఇంట్లోంచి బయటకు వచ్చాను అని, తాను చాలా సంతోషంగా భర్తతో ఉన్నాను, తన అత్తా మామ కూడా బాగా చూసుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఆ అక్కలు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు క్లోజ్ చేశారు.