దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా ఇండియా టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్ కనెక్షన్ను తొలగిస్తారు. వినియోగదారులు ఏ సిమ్ కార్డులను అట్టేపెట్టుకుంటారో ఎంపిక చేసుకునే సౌలభ్యం కల్పించి, మిగతా కనెక్షన్లకు డీ యాక్టివేట్ చేయాల్సిందిగా డాట్ ఆదేశించింది.