Site icon TeluguMirchi.com

తెలంగాణతో పాటు ఏడు రాష్ట్రాల్లో టిక్‌టాక్‌ బ్యాన్‌

మారుతున్న టెక్నాలజీతో మనం మరాల్సి ఉంది. కాని టెక్నాలజీని దుర్వినియోగం చేసుకుటూ, సమయంను వృదా చేయడం అనేది కరెక్ట్‌ కాదు. టెక్నాలజీలో మునిగి పోవడం ముఖ్యంగా సోషల్‌ మీడియాలో మునిగి పోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈమద్య కాలంలో వచ్చిన టిక్‌టాక్‌ కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవడంతో పాటు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ రంగాలకు చెందిన ఉద్యోగస్తులు చాలా మంది డ్యూటీని వదిలేసి టిక్‌టాక్‌లు చేస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా టిక్‌టాక్‌పై నిరసన వ్యక్తం అవుతుంది.

టిక్‌టాక్‌ను నిషేదించాల్సిందే అంటూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా కేంద్రం వద్దకు ఏడు రాష్ట్రాలు టిక్‌టాక్‌ బ్యాన్‌ గురించిన విజ్ఞప్తిని ఉంచడం జరిగింది. తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలు కేంద్ర రపభుత్వంను ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో తమిళనాడు మాత్రమే టిక్‌టాక్‌ బ్యాన్‌పై స్పందించింది. ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం దిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కాకున్నా మరికొన్నాళ్లలో టిక్‌టాక్‌ బ్యాన్‌ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version