దారుణం : 6 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల ముసలోడి అఘాయ్యితం

ఆడవారికి రక్షణ ఎక్కడ లభించడం లేదు, ఎవరి వల్ల కూడా అమ్మాయిు సేఫ్‌ అవ్వడం లేదు. ముస్సలోడి నుండి నూనూగు మీసాల పోరగాడి వరకు అంతా కూడా అమ్మాయిలను కామంతోనే చూస్తున్నారు. కొన్ని సార్లు ఆ చూపు శృతిమించి రేప్‌లకు దారి తీస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన యావత్‌ రాష్ట్రం తదించుకునేలా చేసింది. 60 ఏళ్ల ముసలోడు 6 ఏళ్ల బాలికను రేప్‌ చేసేందుకు ప్రయత్నించాడు.

మేడ్చల్‌కు చెందిన 60 వృదుడి వద్ద 6 సంవత్సరాల బాలిక ఉంటుంది. అమ్మాయికి తాత అయ్యే ఆ వృద్దుడు ఎవరు లేని సమయంలో అమ్మాయిపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అమ్మాయి అమ్మమ్మకు చెప్పడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. దాంతో వృద్దుడిని స్థానికులు చితక బాదారు. ఆపై ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కఠిన చట్టాలతో కేసు బుక్‌ చేశారు. ఇలాంటి నీచులను వెంటనే రోడ్డు మీద కాల్చి చంపేయాలంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.