దేశంలో పసిపిల్లల ఫై , ఆడవారి ఫై అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. చట్టాలు , కోర్ట్లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో బంజారా హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు 50 ఏళ్ల వృద్ధుడు.
వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ నగర్లో నివాసం ఉండే.. చెన్నయ్య అనే వృద్ధుడు ఇంటి పక్కనేఉన్నవారితో స్నేహం పెంచుకున్నాడు. ఓ ఇంట్లోని నాలుగేళ్ల చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకొని, చిన్నారి తల్లి పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై కన్నేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తల్లి పనినుంచి ఇంటికి తిరిగివచ్చేసరికి ఇంట్లో చిన్నారి లేకపోవడంతో.. ఇంటి పక్కల అంతా వెతికారు.. ఆ తర్వాత చెన్నయ్య ఇంటి నుంచి ఏడుస్తూ బయటకు వచ్చిన చిన్నారిని గమనించిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈలోపు అక్కడి నుంచి జారుకున్నాడు చెన్నయ్య. ప్రస్తుతం పోలీసులు చెన్నయ్య కోసం వెతుకుతున్నారు.