Site icon TeluguMirchi.com

విద్యుత్ సంక్షోభం.. 28 రైళ్లు రద్దు!

apngosరాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడటంతో పలు రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సంక్షోభం కారణంగా దక్షిణ మధ్య రైల్వే ఆదివారం 28 రైళ్లను రద్దు చేశారు. వీటిలో 24 ప్యాసింజర్, 4 ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పలు రైళ్లు మార్గమధ్యంలో ఆగిపోగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపుతున్నారు.కాజీపేట‌-విజయవాడ, విజయవాడ-గూడూరు- తిరుపతి సెక్షన్ల మధ్య 8 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. చెన్నై- పినాకిని ఎక్స్‌ ప్రెస్‌, విజయవాడ- చెన్నై జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, చెన్నై- విజయవాడ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. విజయవాడ- బిట్రగుంట, బిట్రగుంట- విజయవాడ, బిట్రగుంట – చెన్నై, చెన్నై – బిట్ర గుంట, చెన్నై-గూడూరు మధ్య నడవాల్సిన ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్ళు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక పాట్లు పడ్డారు

Exit mobile version