Site icon TeluguMirchi.com

ఏటీఎంలకు కొత్త రూ.200 నోట్లు దూరం

300 rs noteరిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అతి త్వరలోనే 200 రూపాయల నోటును తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించడంతో 200 నోటు నమూనాను కూడా విడుదల చేసింది. ఇటీవలే 200 నోటు ఏ స్థాయిలో సోషల్‌ మీడియాలో షేర్స్‌ అయ్యిందో చెప్పుకోవచ్చు. ఇక అతి త్వరలోనే రెండు వందల నోట్లను బ్యాంకులకు పంపుతామని, బ్యాంకుల్లో మాత్రమే రెండు వందల నోట్లు తీసుకోవాల్సి ఉంటుందని, ఏటీఎంలలో రెండు వందల నోట్లు రావు అంటూ ఆర్బీఐ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు.

దేశంలోని అన్ని ఏటీఎంలను 200 నోట్ల కోసం సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అది అన్ని బ్యాంకులకు వ్యయ ప్రయాశలతో కూడుకున్నది. ఇటీవలే రెండు వేల నోటు, కొత్త అయిదు వందల నోట్లు వచ్చిన నేపథ్యంలో అప్పుడే సాఫ్ట్‌వేర్‌ అప్‌ డేట్‌ చేయడం జరిగింది. మొన్న మొన్నటి వరకు కూడా కొన్ని ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేటింగ్‌ జరుగుతూనే ఉంది. మళ్లీ రెండు వందల కోసం ఏటీఎంలను అప్‌డేట్‌ చేయడం అంటే పెద్ద పని అని, అందుకే నేరుగా మాత్రమే 200 నోట్లు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

Exit mobile version