తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తృతం అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కారణంగా నగరంలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని 593 మందిని గుర్తించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.
నగరంలో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువుగా ఉన్న 12 ప్రాంతాలను గుర్తించినట్లు… ఆయా ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో జనం కదలికలపై మరిన్ని ఆంక్షలు విధించారు. వ్యక్తులు బయటకు వెళ్లకుండా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రెడ్ జోన్లుగా ప్రకటించి రోడ్లు మూసేశారు. పారిశుధ్యంపై మరింత దృష్టి సారించారు.
ఆ 12 కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఏ ఏరియాలు అంటే..
* మయూరినగర్
* యూసుఫ్‌గూడ
* చందానగర్
* బాలాపూర్
* తుర్కపల్లి
* చేగూరు
* రాంగోపాల్‌పేట – షేక్‌పేట
* రెడ్ హిల్స్
* మలక్‌పేట – సంతోష్‌నగర్
* చాంద్రాయణగుట్ట
* అల్వాల్
* మూసాపేట
* కూకట్‌పల్లి
* కుత్బుల్లాపూర్ – గాజులరామారం