అపాయకర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా 16.6 లక్షల వాట్సాప్ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్ తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది.
కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్ మెషీన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. అనుమానిత అకౌంట్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.