దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. హైదరాబాద్‌కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్ కూడా పూర్తి చేసింది.
కాగా తొలిదశ వ్యాక్సిన్ రవాణాలో భాగంగా కొవిషీల్డ్ టీకా డోసులు నిన్ననే పుణె నుంచి దిల్లీకి చేరుకున్నాయి. స్పైస్‌జెట్ ప్రత్యేక విమానం కొవిడ్ డోసులను దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేర్చింది.
దీనిపై స్పైస్‌జెట్ విమానయాన సంస్థ సహా దిల్లీ విమానాశ్రయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కొవిడ్ టీకాలను రవాణా చేయడం గర్వంగా ఉందని స్పైస్‌జెట్ తెలిపింది. సకాలంలో అన్ని ప్రాంతాలకు టీకా డోసులను చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ చరిత్రాత్మక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందని తెలిపింది.